అందుకే పెళ్లి చేసుకోలేదంటోన్న మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చాడు.

ఇటీవల ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని తన నెక్ట్స్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు.

కాగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే గతకొంత కాలంగా తేజు వివాహం గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ అవేమీ నిజం కాదని తేజు తేల్చి చెప్పేయడంతో ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో తాజాగా తేజు తెలిపాడు.

ఏదైనా రిలేషన్‌లో ఉంటే ఎక్కువ సమయాన్ని వారితోనే గడపాల్సి వస్తుంది.ఇప్పుడు తనకు కెరీర్ మాత్రమే ముఖ్యమని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తేజు అంటున్నాడు.

Advertisement

దీంతో తేజు ఎలాంటి రిలేషన్‌లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఏదేమైనా తేజు నిర్ణయంతో కొంతమేర నిరాశకు లోనైన మెగా ఫ్యాన్స్, ఆయన కెరీర్ పరంగా దూసుకుపోతుండటంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని దేవా కట్ట డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అయ్యాడు.మరి తేజు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు