''గాంజా శంకర్'' ఫస్ట్ హై.. నెవర్ బిఫోర్ అనేలా మాస్ షేడ్ లో సాయి తేజ్..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) గురించి తెలియని వారు లేరు.

ఈయన మొదటి నుండి మీడియం రేంజ్ హిట్స్ అందుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇక మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని విరూపాక్ష సినిమా( Virupakasha )తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

అంతేకాదు 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.మరి ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వగా ఆ తర్వాత వెంటనే బ్రో సినిమాలో పవర్ స్టార్ తో స్క్రీన్ పంచుకున్నాడు.

ఇది యావరేజ్ గా నిలువగా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.సాయి తేజ్ కెరీర్ లో 17వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా నుండి ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Sai Dharam Tej Gaanja Shankar First High Details, Sai Dharam Tej, Gaanja Shankar
Advertisement
Sai Dharam Tej Gaanja Shankar First High Details, Sai Dharam Tej, Gaanja Shankar

సంపత్ నంది( Director Sampath Nandi ) దర్శకత్వంతో సాయి తేజ్ కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ హై ను లాంచ్ చేసారు.టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ టీజర్ ను రిలీజ్ చేసారు.

గాంజా శంకర్ (Gaanja Shankar) గా సాయి తేజ్ మాస్ షేడ్ లో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.ఫస్ట్ హై అంటూ రిలీజ్ చేసిన వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.

Sai Dharam Tej Gaanja Shankar First High Details, Sai Dharam Tej, Gaanja Shankar

పక్కా మాస్ గా సాయి తేజ్ ను ఈ సినిమాలో కనిపించనున్నాడు.సంపత్ నంది (Sampath Nandi) సాయి తేజ్ ను ప్రెజెంట్ చేసిన విధానం ఆయన మేకోవర్ అన్ని కూడా మాస్ ఫ్యాన్స్ ను తెగ అలరిస్తున్నాయి.అలాగే భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్ నంది సాయి తేజ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు