మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు కావస్తుంది.కాని ఇప్పటికి కూడా సక్సెస్ కోసం ఈయన చకోరా పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు.
కెరీర్ మొత్తంలో రెండు మూడు సక్సెస్‌లు మినహా ఏమాత్రం విజయాలను దక్కించుకోలేక పోయిన సాయి ధరమ్ తేజ్ ఇటీవలే ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
గత రెండు సంవత్సరాలుగా తేజూ చేస్తూన్న ప్రతి ఒక్క మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తుంది.వరుసగా దాదాపు అయిదు ఆరు సినిమాలు తేజూకు నిరాశనే మిగిల్చాయి.
ఇలాంటి సమంలో తేజూ తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించి సక్సెస్‌లను దక్కించుకున్న కిషోర్ తిరుమలపై తేజూ చాలా నమ్మకం పెట్టుకున్నాడు.
ఈ చిత్రంతో అయినా సక్సెస్ దారిలో పడతానేమో అంటూ తేజూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్‌ను ఆగస్టు నుండి మొదలు పెట్టాలని నిర్ణయించారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మూడు నెలలు ఆలస్యం చేయాలని తేజూ కోరుకుంటున్నాడు.

తన ప్రతి సినిమాలో కూడా సేమ్ లుక్‌తో కనిపిస్తూ వస్తున్న తేజూ ఈసారి చేయబోతున్న సినిమాకు మాత్రం కొత్త లుక్‌ను ట్రై చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు సంబంధించిన వర్కౌట్లు ప్రారంభించాడు.మూడు నెలల పాటు కొత్త లుక్ కోసం ప్రయత్నాలు చేస్తాను అంటూ దర్శక నిర్మాతలను ఒప్పించినట్లుగా తెలుస్తోంది.
లుక్ ఎలా ఉన్నా లక్ కలిసి రావాలి మరియు కథ మరియు దర్శకుడు బాగుండాలి.అప్పుడే సినిమా సక్సెస్ అవుతుందనే విషయాన్ని తేజూ గుర్తించాలంటూ మెగా ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.
మంచి కథల ఎంపిక చేసుకున్నప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతుందనే విషయాన్ని హీరోలు గుర్తుంచుకుంటే సినిమాలు సక్సెస్ అవుతాయి.లుక్ స్టైలిష్‌గా ఉండి, సిక్స్ ప్యాక్ ఉన్నంత మాత్రాన సక్సెస్ దక్కుతుంది అన్నది నిజం కాదు.
గతంలో వచ్చిన పలు సినిమాలు హీరోల లుక్స్‌కు మంచి పేరు వచ్చి, సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అందుకే తేజూ లుక్స్‌పై శ్రద్ద పెట్టడంతో పాటు సినిమా కథ, స్క్రీన్‌ప్లేపై కూడా శ్రద్ద పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సక్సెస్ సాధించాలనే తాపత్రయంతో ఉన్న తేజూ దాన్ని ఈసారైనా సాధిస్తాడా అనేది చూడాలి.