టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ లో తేజ ఒకరు.ప్రేమకథలను ఆయన ఇచ్చే ట్రీట్ మెంట్ ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూనే వస్తుంది.
ప్రస్తుతం దగ్గుబాటి వారసుడు అభిరాం హీరోగా తేజ డైరెక్షన్ లో అహింస సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది.
ఈ ట్రైలర్ లో హీరో హీరోయిన్ లతో పాటుగా తేజ జయం సినిమా హీరోయిన్ సదా కూడా సర్ ప్రైజ్ చేసింది.సినిమాలో ఆమె ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించిందని తెలుస్తుంది.
ట్రైలర్ లో సదా సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.చాలారోజుల తర్వాత సదా ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.అహింసలో సదా ఉందన్న విషయాన్ని ట్రైలర్ రిలీజ్ వరకు సీక్రెట్ గా ఉంచారు చిత్రయూనిట్.మొత్తానికి సదా మరోసారి తేజ డైరెక్షన్ లో మెప్పించాలని చూస్తుంది.

అహింస ఇప్పటికే పాటలతో బజ్ ఏర్పరచుకోగా సినిమా కూడా తేజా మార్క్ లవ్ అండ్ ఎమోషనల్ రైడ్ గా ఉంటునని తెలుస్తుంది. ఉంటుందని తెలుస్తుంది.దగ్గుబాటి హీరో మొదటి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో అభిరాం తో గీతిక జత కట్టింది.







