అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలో దిక్కుగా పనిచేస్తున్న సచిన్ పైలట్,( Sachin Pilot ) ముఖ్యమంత్రి గెహ్లాట్( CM Ashok Gehlot ) వర్గాల కుమ్ములాటలు ఇప్పుడు తుది దశకు చేరాయి.సొంత కుంపటి పెట్టుకునే దిశగా సచిన్ పైలెట్ సిద్ధమయ్యారు.
బిజెపి ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా సచిన్ డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రభుత్వ మాత్రం ఆయన డిమాండ్ పట్టించుకోకపోగా వసుందురా రాజే ను రెండు మూడు సందర్భాలలో గెహ్లాట్ పొగిడారు.
కూడా దాంతో అసలే అంటి ముట్టనట్లుగా ఉన్న సంబంధాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది.ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చి ఒకటిగా నడపాలని కాంగ్రెస్ అధిష్టానం( Congress Party ) చేయని ప్రయత్నం లేదు.

రాహుల్ తన పాదయాత్రలో కూడా వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చు తనతో కలిసి నడిచేలా చేయగలిగారు,కానీ వీరి మధ్య విభేదాలు పూర్తిస్థాయిలో సమసి పోలేదని తెలుస్తుంది.సచిన్ పైలెట్ తన తండ్రి రాజేష్ పైలెట్ వర్ధంతి సందర్భంగా కొత్త పార్టీ ప్రకటించబోతున్నారని,ఆ దిశగా రెండు రెండు పేర్లను కూడా నమోదు చేయించారని ,ఒక పేరును 11వ తేదీన ప్రకటిస్తారని తెలుస్తుంది .రాజస్థాన్లో కీలక నాయకుడైన సచిన్ సొంత పార్టీ పెట్టుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఎదురు దెబ్బ అవుతుంది.కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన ఆయన తండ్రి రాజేష్ పైలెట్ అనేక సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో తనకంటూ కొన్ని వర్గాల మద్దతు దక్కించుకున్నారు.

ఇప్పుడు సచిన్ సొంత కుంపటి పెట్టుకుంటే ఆయా వర్గాలు కాంగ్రెస్కు దూరమయ్యే అవకాశం ఉంది .అంతేకాకుండా అదును కోసం ఎదురుచూస్తున్న భాజపా కూడా పరోక్ష మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయన కనక సొంత పార్టీ పెట్టుకుంటే ఆయన చీల్చే మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే గనుక మరొకసారి అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్ నాయకుల కల గానే మిగిలిపోవచ్చు.మరి అధిష్టానం ఈ విషయంలో ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకొని పరిస్థితిని సరిదిద్దకపోతే కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయమని చెప్పవచ్చు.
మరి పరిస్థితిని అధికార కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి
.






