షాకింగ్.. ఆకలితో ఏకంగా యజమానినే పీక్కుతిన్న పిల్లులు..!

సాధారణంగా మనుషులు కుక్కలు, పిల్లులను ఎక్కువగా పెంచుకుంటారు.అయితే కుక్కలు, పిల్లులు రెండు కూడా తమ యజమానికి ఎలాంటి హాని తలపెట్టవు.

 Russian Woman Dead Body Eaten By Pet Cats Details, Hungry, Cats, Eating, Owner, Viral Latest, News Viral, Social Media, Russian Woman, Dead Body ,eaten By Pet Cats, 20 Pet Cats, Pet Cats Owner, Russia, Hungry Cats-TeluguStop.com

కానీ యజమానిని కాపాడటంలో కుక్కలే ముందుంటాయి.శునకాలు తన యజమాని చనిపోయిన అక్కడే రోదిస్తూ బాడీని కాపాడుతూ ఉంటాయి.

కానీ పిల్లులు మాత్రం అలా కాదు.వాటిని ఎంత ప్రేమగా పెంచుకున్నా అవి ఓనర్ బాడీని పీక్కుతినేందుకు ఏ మాత్రం సందేహించవు.

 Russian Woman Dead Body Eaten By Pet Cats Details, Hungry, Cats, Eating, Owner, Viral Latest, News Viral, Social Media, Russian Woman, Dead Body ,eaten By Pet Cats, 20 Pet Cats, Pet Cats Owner, Russia, Hungry Cats-షాకింగ్.. ఆకలితో ఏకంగా యజమానినే పీక్కుతిన్న పిల్లులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇది మరోసారి నిజమైంది.రష్యాలో ఇరవై పిల్లులు కలిసి చనిపోయిన తమ ఓనర్ బాడీని పీక్కుతిన్నాయి.

వివరాల్లోకి వెళితే.రష్యాలోని బటేస్క్‌ సిటీలో నివసిస్తున్న ఒక మహిళ 20 మైనే కూన్ పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది.అయితే ఈ మహిళ 2 వారాల క్రితం మరణించింది.ఆమె మరణానికి కారణాలు తెలియవు.

అయితే ఇంట్లో లాక్ వేసుకుని చనిపోవడంతో అందులోని పిల్లులు బయటికి రాలేకపోయాయి.ఫుడ్ కూడా అందించే వారు ఎవరూ లేకపోవడంతో అవి ఆకలితో బాగా బాధపడ్డాయి.

అయితే తీవ్రమైన ఆకలితో అల్లాడిన కొన్ని పిల్లులు తమనెంతో అల్లారుముద్దుగా పెంచిన యజమాని శవాన్ని ఆరగించడం మొదలెట్టాయి.

అయితే ఈ మృతురాలికి ఒక ఫ్రెండ్, కో-వర్కర్ ఉంది.

వీరిద్దరూ తరచూ మీట్ అయ్యేవారు.

కానీ రెండు వారాలైనా తన ఫ్రెండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో కంగారు పడింది.అనంతరం తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.అయితే పిల్లులు పెంచుకుంటున్న తన ఫ్రెండ్ ఇంటి నుంచి దుర్వాసన వచ్చింది.

ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు.దీంతో ఆమె పోలీసులకు కాల్ చేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు పిల్లుల యజమాని ఇంటికి వచ్చారు.అనంతరం డోర్ బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది.

అదేంటంటే, కుళ్లిపోయిన శవాన్ని పిల్లులు పీక్కుతింటున్నాయి.భరించలేని దుర్వాసన ఆ వాతావరణాన్ని మరింత భీతావాహంగా మార్చింది.

అతి కష్టమ్మీద పోలీసులు బాడీని పోస్ట్ మార్టమ్ కోసం సేకరించారు.ఏది ఏమైనా యజమానిని పిల్లులు పీకుతున్న ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube