ఇండియాని అభ్యర్థిస్తున్న రష్యా... విషయం ఇదే!

ఉక్రెయిన్ – రష్యా )( Ukraine యుద్ధం నేపథ్యంలో… రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశాలన్నీ ఒకేతాటిపైకి వచ్చాయి.ఇప్పటికే నాటో దేశాలు రష్యాను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాయో అందరికీ తెలిసిందే.

 Russia Requesting India... This Is The Matter! Russia , India , Telugu Nri, Late-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇటీవల ఎఫ్ ఏ టి ఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) నుంచి రష్యాను సస్పెండ్ చేయడం జరిగింది.ఇక ఇదే మంచి తరుణమని భావించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ( Zelensky ), ఎఫ్ ఏ టి ఎఫ్ నిబంధనలతో రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలని ప్రపంచదేశాలను కోరడం జరిగింది.

Telugu India, Latest, Narendra Modi, Russia, Telugu Nri, Ukraine Russia, Vladimi

ఈ నేపథ్యంలో వచ్చే నెలలో దీనికి సంబంధించిన సమావేశం జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.కాగా ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి ఇపుడు రష్యా, భారతదేశ సాయం కోరుతోంది.ఇక ఆప్తమిత్ర దేశం అయిన రష్యాతో భారత్ వున్న సంబంధాలు గురించి అందరికీ తెలిసిందే.ఇరు దేశాలకు అనేక వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలు అనేవి ఉన్నాయి.ఈ క్రమంలోనే భారతదేశంలో అనేక ప్రాజెక్టులను రష్యా చేపడుతోంది.ఈ తరుణంలో ఎఫ్ ఏ టి ఎఫ్ కింద రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తే మాత్రం ఆ ప్రభావం భారత్ పై కూడా పడక తప్పదు.

Telugu India, Latest, Narendra Modi, Russia, Telugu Nri, Ukraine Russia, Vladimi

భారత్ తనకున్న పలుకుబడితో ఈ ప్రమాదం నుంచి ఎలాగన్నా బయటపడేయాలని రష్యా(Russia )అడుగుతోంది.సాధారణంగా ఉగ్రవాదానికి సహకరించే ఆర్థిక నిధులను సమకూర్చే దేశాలపై ఎఫ్ ఏ టి ఎఫ్ నిబంధనలు విధిస్తుంది.ఇక రష్యా నుంచి ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదానికి నిధులు కానీ ఇవ్వడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు.ఈ నేపథ్యంలో ఎఫ్ ఏ టి ఎఫ్ ఆంక్షల కిందకు రష్యా ఎలా వస్తుందని ప్రశ్నిస్తోంది రష్యా.

ఇప్పటికే ఎఫ్ ఏ టి ఎఫ్ బ్లాక్ లిస్టులో ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి.ఒక వేళ ఆంక్షలు విధిస్తే రష్యా కూడా ఈ జాబితాలో చేరుతుంది.

అయితే ఇండియా రష్యా ప్రతిపాదనను ఎలా చూస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube