కొడుకు ఎదుటే పెళ్లి చేసుకున్న ప్రముఖ బుల్లితెర నటి.. ఆరేళ్ల చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం అన్నది కామన్.

నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లిళ్లు చేసుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలు అలాగే ఉన్నారు.

కొందరు లేటుగా పెళ్లిళ్లు చేసుకుంటే మరికొందరు లేటుగా రెండవ పెళ్లికి కూడా సిద్ధమవుతూ ఉంటారు.అలా తాజాగా ఒక నటి కూడా లేటు వయసులో అది కూడా కొడుకు ఎదుటే రెండో పెళ్లి చేసుకుంది.

ఇక్కడ ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే తనకంటే ఆరేళ్లు చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయం.

ఆ వివరాల్లోకి వెళితే.బుల్లితెర నటి రూపంజన మిత్ర( Rupanjana mitra ) తన ప్రేమను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.43 ఏళ్ల వయసులో ప్రియుడు రతూల్‌ ముఖర్జీ( Ratool mukherjee )ని పెళ్లాడింది.పశ్చిమ బెంగాల్‌లోని రాజర్హత్‌లో తాజాగా బెంగాలీ సాంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది.

Advertisement

ఎర్రని బనారస్‌ చీర ధరించిన నటి రూపంజన బంగారు నగలు ధరించింది. వరుడు రతూల్‌ ధోతి కట్టుకుని పీటలపై కూర్చున్నాడు.

రూపంజన తనయుడు పంజాబీ డ్రెస్‌లో మెరిశాడు కాగా రూపంజన 2007లో రిజాల్‌ హఖీని పెళ్లాడింది.వీరికి రియాన్‌ అనే కుమారుడు పుట్టాడు.

కొంతకాలానికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు.అప్పటినుంచి బాబు తల్లితోనే ఉంటున్నాడు.ఇంతలో రూపంజన మరోసారి ప్రేమలో పడింది.

రతూల్‌ అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది.అతడు నటి కంటే ఆరేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తన కుమారుడు, ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉంది రూపంజన.గత ఏడాది డార్జిలింగ్‌లో ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

Advertisement

ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతుండగా లేటు వయసులో కొడుకు ఉండగా అవసరమా ఇప్పుడు పెళ్లి అంటూ కొందరు నెగటివ్గా కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు