లక్నో కొంపముంచిన రనౌట్లు.. ఓటమిపై స్పందించిన కృనాల్ పాండ్యా..!

ముంబై జట్టు చేతిలో లక్నో ఘోరంగా ఓడిపోవడానికి రనౌట్లు( Run outs ) ప్రధాన కారణం.లక్నో కీలక బ్యాటర్లైన మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్ లు రన్ అవుట్ అయి పెవిలియన్ చేరడం ముంబై జట్టుకు కలిసి వచ్చింది.

 Runouts By Lucknow Krunal Pandya Reacts To The Defeat Details, Ipl2023,latest Ne-TeluguStop.com

అంతేకాకుండా ముంబై బౌలర్ ఆకాష్ మధ్వల్( Akash Madhwal ) బౌలింగ్లో లక్నో ఏకంగా ఐదు వికెట్లను కోల్పోయింది.లక్నో ఫీల్డింగ్ లో అద్భుత ఆటను ప్రదర్శించింది కానీ బ్యాటింగ్లో మాత్రం మొదటి నుంచే చేతులు ఎత్తేసి ఓటమిని ఖాతాలో వేసుకొని ఇంటి ముఖం పట్టింది.

లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా( Krunal pandya ) ఓటమిపై స్పందిస్తూ పూర్తి బాధ్యత తనదే అని తెలిపాడు.లక్నో ఓటమిలో తన బ్యాటింగ్ వైఫల్యం కీలకం అయిందని, అందుకే తమ జట్టు పరాజయం ఎదుర్కొందని తెలిపాడు.బంతి బౌండరీకి వెళ్లడం కోసం ఆ షాట్ ఆడాల్సింది కాదని, తన వికెట్ తోనే లక్నో పతనం ప్రారంభమైందని తెలిపాడు.లక్ష్య చేదనకు దిగిన తమ జట్టు ఆరంభంలో మెరుగుగా 69/2 పరుగులు చేశాక తాను ఆడిన చెత్త షాట్( Bad shot ) తో లక్నో పతనం ప్రారంభమై వరుస వికెట్లను కోల్పోయిందని, గెలిచే మ్యాచ్ తనవల్లే ఓడిందని తెలిపాడు.

మ్యాచ్ లో ఏ జట్టు అయిన వికెట్లను కోల్పోవడం సహజం.కానీ తాము కాస్త మెరుగుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది.కానీ తాము బాధ్యతారహితంగా ఆడామని తెలిపాడు.ఇక కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్ లలో ఎవరిని ఆడించాలి అనేది కాస్త కఠినమైన విషయమే.అయితే చెన్నైలో డికాక్ కంటే కైల్ మేయర్స్ కు మంచి రికార్డు ఉండడంతో కైల్ మేయర్స్ ను ఆడించామని తెలిపాడు.లక్నో జట్టు ఓటమికి తనే కారణం అంటూ, పూర్తి బాధ్యత తనదే అంటూ కెప్టెన్ కృనాల్ పాండ్యా తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube