రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాకు కలెక్షన్లు సైతం అంచనాలకు మించి వస్తున్నాయి.
ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఆర్ఆర్ఆర్ యూనిట్ సైతం సంతోషంగా ఉంది.అయితే ఆర్ఆర్ఆర్ సెకండాఫ్ విషయంలో తారక్ హర్ట్ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
సెకండాఫ్ లో ఎలివేషన్లు ఇవ్వకపోవడం, క్లైమాక్స్ లో పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తారక్ ఫీలయ్యారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
నాలుగేళ్లు ఏ సినిమాకు డేట్స్ కేటాయించకుండా ఆర్ఆర్ఆర్ మూవీకే తారక్ పరిమితం కాగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తారక్ కు ఏ మాత్రం దక్కలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
కొన్ని సన్నివేశాల విషయంలో, యాక్షన్ సీక్వెన్స్ ఆర్డర్ విషయంలో ఎన్టీఆర్ హర్ట్ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది.నార్త్ బెల్ట్ లో చరణ్, ఎన్టీఆర్ ల నటనకు మంచి మార్కులు పడుతున్నా అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించడం చరణ్ కు మరింత కలిసొచ్చింది.

అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ తన రోల్ విషయంలో సంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.చరణ్ కు ఏ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయో తారక్ కు కూడా అదే స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్నాడని తారక్ అభిమానులు చెబుతుండటం గమనార్హం.తారక్ ఒకసారి స్పందించి ఈ విమర్శలకు చెక్ పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.
మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది.ఆచార్య మూవీ ప్రమోషన్స్ ముగిసిన వెంటనే కొరటాల శివ తారక్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
తారక్ తో సినిమాను వేగంగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు.ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ గా కనిపిస్తారని తెలుస్తోంది.







