సినిమాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ తల్లి.. ఆ పాత్రలో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ, ప్రశాంత్ నీల్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు.అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గురించి రెండు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తల్లో నిజానిజాలు తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ వార్తలు నిజమైతే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడని.

రీల్ లైఫ్ పాలిటిక్స్ లో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగులు కూడా ఉంటాయని ఆ డైలాగ్స్ ఒక పార్టీని టార్గెట్ చేసేలా ఉంటాయని వైరల్ అవుతున్న వార్త సారాంశం.

Rumours Goes Viral About Junior Ntr Trivikram Movie, Ayinanu Poyiravala Hastinak
Advertisement
Rumours Goes Viral About Junior Ntr Trivikram Movie, Ayinanu Poyiravala Hastinak

ఈ రూమర్ తో పాటు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని నిజజీవిత పాత్రలో నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.సినిమాలో ఎన్టీఆర్ తల్లి పాత్ర కొన్ని నిమిషాల పాటే ఉంటుందని.త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు తల్లి పాత్ర కోసం షాలినిని రెఫర్ చేశారని వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ రూమర్ లో వాస్తవం తెలియాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ రోల్ లో ఇప్పటివరకు నటించలేదు.

ఎన్టీఆర్ తల్లి షాలిని ఒక్క సినిమాలో కూడా నటించలేదు.ఈ రెండు వార్తలు నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు