పవన్ సినిమాకు ఒక రూల్ మిగతా సినిమాలకు మరో రూల్.. ఏపీ నెటిజన్ల కామెంట్స్ వైరల్!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించింది.ఏపీ ప్రభుత్వం నిబంధనల వల్ల 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సిన భీమ్లా నాయక్ సినిమా ఫుల్ రన్ లో కేవలం 95 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితం కావడం గమనార్హం.

 Rules Are Applicable Only Pawn Kalyan Movies Details, Pawan Movie, New Rules, Pa-TeluguStop.com

అయితే భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత ఏపీలో సినిమాల రిలీజ్ విషయంలో నిబంధనలు మారిపోయాయి.

రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు ఏపీ సర్కార్ నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు లభించాయి.

త్వరలో బీస్ట్, కేజీఎఫ్2 సినిమాలు విడుదల కానుండగా ఈ రెండు సినిమాలకు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు ఎదురుకావడం లేదు.ఏపీలోని పలు ప్రాంతాలలో ఈ సినిమాలకు సంబంధించి ఐదు షోలు ప్రదర్శితం కానున్నాయని సమాచారం అందుతోంది.

పవన్ సినిమా రిలీజైతే మాత్రం ఏపీ సర్కార్ కఠినంగా రూల్స్ అమలు చేస్తుంది.

ఏపీ ప్రభుత్వం రూల్స్ గురించి చెప్పి పవన్ సినిమాలను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుండటం గమనార్హం.

Telugu Bheemla Nayak, Cmjagan, Harihara, Kgf, Pawan Kalyan, Pawan, Radhe Shyam,

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఒకింత ఆగ్రహంగానే ఉన్నారని తెలుస్తోంది.భీమ్లా నాయక్ సినిమా విడుదలైన తర్వాతే ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ల జీవోను అమలులోకి తీసుకురావడం గమనార్హం.ఏపీ సర్కార్ జీవోలో చెప్పిన నిబంధనలను మెజారిటీ నిర్మాతలు పాటించడం లేదు.

Telugu Bheemla Nayak, Cmjagan, Harihara, Kgf, Pawan Kalyan, Pawan, Radhe Shyam,

సీఎం జగన్ ను కలిసిన వాళ్లకు అదనపు రేట్లకు కూడా అనుమతులు లభిస్తూ ఉండటం గమనార్హం.ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా అమలవుతున్నాయి.హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యే సమయంలో ఏపీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.

ఏపీ నెటిజన్లు పవన్ సినిమాల విషయంలో, ఇతర సినిమాల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును మీమ్స్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube