మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, పూజ ప్రధాన తారాగణంగా.ఆర్.
కె.గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు శరవేగంగా జరుపుకుంటోంది.
పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.
కె.గాంధీ మాట్లాడుతూ.‘‘ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాము.నూతన నటీనటులతో పాటు సీనియర్ నటులు నటించిన ఈ చిత్రం చాలా బాగా వచ్చింది.
నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు.త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాము.
’’ అని తెలిపారు.
మణిసాయితేజ, వైడూర్య, నాగమహేశ్, పవన్ వర్మ, రేఖ, రాజేశ్ రెడ్డి, తేజస్వి రాజు, శ్రీవాణి, ధీరజ్ అప్పాజీ, సంతోష్, తరుణ్, కృష్ణ, ఆటో రాజు, సురేష్ కొండేటి, పొట్టిమామ, అక్షరనిహా, సునంద, వెంకటేశ్వర్లు, శోభరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: ఎం.నాగేంద్ర కుమార్, సంగీతం: గంటాడి కృష్ణ, పాటలు: జయసూర్య, డ్యాన్స్: అన్నారాజ్, కపిల్; స్టంట్స్: బాజి, స్టార్ మల్లి, థ్రిల్లర్ మంజు; పీఆర్వో: వీరబాబు, నిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గరాజు కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కె.గాంధీ.