దిశ హత్య కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలకి ఒక ముగింపు లభించింది.దిశని చంపిన వాళ్ళని ఎన్ కౌంటర్ చేయాలనే ప్రజల డిమాండ్ కి తగ్గట్లే వాళ్ళు పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యారు.
చట్ట పరిధి దాటి నిందితులకి శిక్ష పడిన కూడా దేశ వ్యాప్తంగా దీనిని సమర్ధిస్తున్నారు.పోలీసులకి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.
ఎన్నడూ లేని విధంగా పోలీసుల మీద పూల వర్షం కురిపించారు.దిశకు న్యాయం జరిగిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా పోలీసుల తీర్పుకి మద్దతు లభిస్తుంది.
ఇదిలా ఉంటే హర్యానాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అయితే ఏకంగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు నజరానా ప్రకటించింది.
హైదరాబాద్ పోలీసులు చేసిన పనిని తాము అభినందిస్తున్నామన్నారు.రా గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రివార్డు అందజేస్తామని చెప్పారు.
ఇక రాజకీయ పక్షాల నుంచి కూడా పోలీసులు చేసిన పనికి ప్రసంశలు లభిస్తున్నాయి.