టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో టీడీపీ( TDP ) అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ అందిస్తామని తెలిపారు.ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్( Pension ) అందకుంటే ఇవి కూడా కలిపి ఇస్తామని చెప్పారు.
అలాగే టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల వ్యవస్థను( Volunteer System ) కొనసాగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
న్యూట్రల్ గా పని చేసే వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.అలాగే వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పిస్తామన్న చంద్రబాబు వాలంటీర్లకు మెరుగైన జీతం వచ్చేలా చేస్తామని తెలిపారు.