స్టార్ హీరోల సినిమాలు మరో స్టార్ హీరో సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ వేసి ఆ స్టార్ హీరో రెస్పాన్స్ ని ప్రమోషన్స్ కి వాడుకోవడం అదో స్టాటజీ అనుకుంటారు.అది స్ట్రాటజీ అవునా కాదా అన్నది పక్కన పెడితే రాజమౌళి సినిమా అంటే హీరోలంత తమకు తోచిన సాయం చేయాల్సిందే.
అందులోనూ బాహుబలి లాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ అంటే ఆ హీరోకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.అందుకే ఆర్.
ఆర్.ఆర్ సినిమాని ప్రభాస్ కూడా ప్రమోట్ చేయనున్నాడు.
శుక్రవారం రిలీజైన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ కి సినిమా చూపించే ఏర్పాట్లు చేస్తున్నారట.
ప్రస్తుతం స్పెయిన్ లో సేద తీరుతున్న ప్రభాస్ ఆదివారం ఈవెనింగ్ కల్లా హైదరాబాద్ వస్తారట.మండే రోజు ప్రభాస్ కోసం ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంద్ది.రాజమౌళి, ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్ అందరు కలిసి ఈ సినిమా చూస్తారని తెలుస్తుంది.బాహుబలి క్రేజ్ ని కూడా ఆర్.ఆర్.ఆర్ కి వాడాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి ప్రభాస్ ఎంకరేజ్ తో ఆర్.ఆర్.ఆర్ కి మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.