స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 2020 సంవత్సరంలోనే విడుదల కావాల్సి ఉన్నా ఎన్నో అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమా అంతకంతకూ వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా త్రీడీలో కూడా విడుదలైందనే సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో త్రీడీ ఫార్మాట్ లో సినిమాలను ప్రదర్శించే థియేటర్లు లేవు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీని త్రీడీలో చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది.2డీలో ఆర్ఆర్ఆర్ ను చూసిన వాళ్లు ఈ సినిమా అద్భుతంగా ఉందని చెబుతుంటే త్రీడీలో చూసిన వాళ్లు మాత్రం భిన్నంగా స్పందిస్తుండటం గమనార్హం.త్రీడీలో చూసిన ప్రేక్షకులు కొంతమంది మాత్రమే అయినా వాళ్లందరి నుంచి ఈ సినిమాపై నెగిటివ్ గానే కామెంట్లు వస్తున్నాయి.
ఈ సినిమా జనవరి నుంచి మార్చికి వాయిదా పడటంతో జక్కన్న త్రీడీకి ఓకే చెప్పారు.

అయితే త్రీడీలో ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే పరిమితంగా ఈ సినిమా త్రీడీ థియేటర్లలో విడుదల కావడంతో ఆర్థికంగా ఈ సినిమాకు నష్టం కలిగే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి.జక్కన్న మాత్రం త్రీడీ వెర్షన్ విషయంలో జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదని కొందరు చెబుతున్నారు.

మరోవైపు సినిమాసినిమాకు దర్శకునిగా జక్కన్న తన స్థాయిని పెంచుకుంటున్నారు.సినిమాను ఎంత బడ్జెట్ తో తెరకెక్కించినా తన సినిమాల వల్ల నష్టాలు అయితే రావని జక్కన్న ప్రూవ్ చేశారు.జక్కన్నతో సినిమాలను నిర్మించడానికి పెద్ద నిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్ తారక్ తర్వాత సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.