తెలుగు ప్రేక్షకులు మొన్నటి వరకు సాహో.సైరా చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
ఆ రెండు సినిమాలు కూడా వచ్చి వెళ్లి పోయాయి.ఇప్పుడు అందరి దృష్టి.
ఆశ.ఆసక్తి కూడా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై ఉంది.ఈ చిత్రానికి జక్కన్న దర్శకత్వం వహిస్తున్నాడు కనుక ఎలా ఉంటుందో అనే అనుమానాలే అక్కర్లేదు.ఎందుకంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మరో బాహుబలి రేంజ్‌లో ఉంటుందని అందరి నమ్మకంగా పైగా ఈ చిత్రంలో ఇద్దరు యంగ్ సెన్షేషనల్ స్టార్స్ ఉన్నారు.
రామ్ చరణ్.ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు రాజమౌళి ఇచ్చింది లేదు.ఎప్పుడెప్పుడు ఫస్ట్‌లుక్ వస్తుందా అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను చాలా లో ఫ్రొఫైల్‌లో దర్శకుడు పూర్తి చేయాలని, ముందే హడావుడి చేయవద్దనే ఉద్దేశ్యంతో ఫస్ట్‌లుక్‌ను ఇప్పటి నుండే విడుదల చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఈ దీపావళికి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ కూడా తమ సినిమాల ఫస్ట్‌లుక్‌లను పోస్టర్‌లను రచ్చ రచ్చగా విడుదల చేస్తున్నాయి.కాని ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్ గురించిన అప్‌డేట్ మాత్రం లేదు.దీపావళికి కూడా ఆర్‌ఆర్‌ఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పడం లేదు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపస్తుంది.
రాజమౌళి ప్రేక్షకుల కోసం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్‌డేట్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు.మరి జక్కన్న నేడు ఏమైనా స్పందించేనా చూడాలి.