నా వల్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చింది... నటుడు అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్( NTR ) రామ్ చరణ్( Ramcharan ) హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్( RRR ).ఈ సినిమా విడుదలయ్యి నేటికీ సరిగ్గా ఏడాది కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

 Rrr Got An Oscar Because Of Me Actor Ajay Devgans Shocking Comments ,rajamouli ,-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల ఈ కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డు( Oscar Award ) కూడా అందుకుంది.

ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్( Ajay Devagan ) కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈయన శ్రీయ ఇద్దరు జోడిగా నటించారు.ఇక చిన్నప్పటి రామ్ చరణ్ నటించిన పాత్రలో వీరు ఆయనకు తల్లిదండ్రులుగా నటించారు.

ఇలా అజయ్ దేవగన్ ఈ సినిమా విజయంలో భాగమయ్యారు.ఇకపోతే తాజాగా అజయ్ దేవగన్ నటించిన భోళా(Bhola) ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన కపిల్ శర్మ( Kapil Sharma ) షోకి హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కపిల్ శర్మ ప్రశ్నిస్తూ మీరు నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం మీకు ఎలా అనిపించిందని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అజయ్ దేవగన్ సమాధానం చెబుతూ తన వల్లే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటూ ఈయన ఫన్నీగా సమాధానం చెప్పారు.తాను కనుక నాటు నాటు పాటకు డాన్స్ చేసి ఉంటే ఆస్కార్ అస్సలు వచ్చేది కాదని నేను చేయకపోవడం వల్లే ఈ సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటూ అజయ్ దేవగన్ తాను డాన్స్ విషయంలో చాలా పూర్ అనే విషయాన్ని చెప్పకనే చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube