గోల్డెన్ గ్లోబ్స్ వద్ద ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ.. పిక్ అదిరిందిగా!

ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను నెలకొల్పాడు.

 Rrr Family Pic Viral On Social Media , Rrr, Ram Charan, Rajamouli, Ntr, Social M-TeluguStop.com

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ వైడ్ గా రిలీజ్ అయ్యి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక మన తెలుగు సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.

దీంతో తెలుగు ఖ్యాతి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి అదరగొట్టారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే.మరి ఈ వేడుకల్లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ అంతా యూఎస్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి లతో పాటు వారి భార్యలు సైతం ఈ వేడుకలో మెరిశారు.

లేటెస్ట్ గా వీరంతా కలిసి యూఎస్ లో స్పెషల్ షోకు హాజరు కాగా ఇందులో భాగంగా వీరంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో టీమ్ షేర్ చేసింది.ఈ పిక్ లో టీమ్ అంతా తమ భార్యలతో కలిసి దిగిన ఈ ఫోటో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.మరి ఈ ఫోటో పర్ఫెక్ట్ ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ పిక్ లాగా అనిపించింది.

ఈ రేర్ పిక్ ను అభిమానులు షేర్ చేసుకుంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube