మహిళా కార్డును సక్సెస్ఫుల్గా ప్రయోగించిన రోజా?

వైఎస్ఆర్ సిపి నాయకురాలు మంత్రి రోజా( Minister Roja ) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) ఇప్పటికే అరెస్టై బేయిల్ పొందారు.అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదలను అంటున్న మంత్రి రోజా దీనిని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారేలా చేశారు.

 Roja Who Successfully Used The Womens Card, Rk Roja , Bandaru Satyanarayana ,-TeluguStop.com

ముఖ్యంగా మంత్రి రోజాకు ఆమె సహచర నటీమణుల నుంచి గట్టి మద్దతు లభించింది.ముఖ్యంగా మీనా, రమ్యకృష్ణ, కుష్బూ నవనీత్ కౌర్( Navneet Kaur ) ,రాధిక వంటి నటీమణులు రోజాకు మద్దత్తు గా మాట్లాడుతూ బండారు కు తగిన శిక్ష విధించాల్సిందిగా డిమాండ్ చేశారు.

వీరందరూ సినిమాలలో రోజాకు సహచర నటీమణులు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా తమదైన ముద్రను వేసుకున్నారు .ఇప్పుడు వీరందరూ రోజాకు అండగా నిలబడ్డారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ ఈ స్థాయిలో మహిళల గౌరవ మర్యాదలకు భంగకరంగా వ్యవహరించిన బండారు సత్యనారాయణ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.మానవత్వానికి మాయని మచ్చలా వ్యవహరించిన బండారుకు గట్టి బుద్ధి చెప్పాలంటూ వీరు సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేశారు./br>

అయితే మంత్రి రోజా( Minister Roja ) కూడా అనేక సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలపై శృతిమించిన విమర్శలు చేశారని అప్పుడు ఈ నటిమలు అందరూ ఎక్కడికి పోయారు అంటూ తెలుగుదేశం రివర్స్ ఎటాక్ చేసినప్పటికీ అంతిమంగా మహిళను ఈ విధంగా మాట్లాడటం తప్పే అంటూ మెజారిటీ జనాలు అభిప్రాయపడ్డారు.ఏది ఏమైనా రాజకీయాల్లో ఎవరు మొదలుపెట్టినా అసభ్యత అన్నది అంగీకారం కాదు .ప్రజాస్వామ్యంలో జెండర్ ఆధారంగా ఒక మనిషిని విమర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకం కాదని అందరు అంగీకరించాల్సిందే.ఆ దిశగా రోజా తన సహచర నటీమణుల నుంచి గట్టి మద్దతు తెచ్చుకోగలగడం అభినందనీయం.

ఏది ఏమైనా ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో పునరావృతం కాకూడదనే అందరూ కోరుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube