జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి మంత్రి ఆర్కే రోజా విమర్శలతో విరుచుకుపడ్డారు.
గత కొద్ది రోజులుగా పవన్ కు చెందిన ఎన్నికల ప్రచార రథం వారాహి పై ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
ఆ వాహనం రంగు పైనా వివాదం నడుస్తోంది.తాను శ్వాస తీసుకోవాలో వద్దో వైసీపీ నేతలే చెప్పాలంటూ సెటైర్లు పవన్ వేస్తున్నారు.
దీనిపైన వైసిపి మంత్రులు స్పందిస్తున్నారు.తాజాగా ఇదే అంశంపై మంత్రి రోజా స్పందించారు.
ఈ రోజు తిరుపతిలో జరిగిన ఏపీ సమీకృత సుస్థిర పర్యటన ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సులో పాల్గొన్న రోజా ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.పవన్ పై విమర్శలు చేశారు.
పవన్ వాహనం వారాహి కాదని, అది నారాహి అని సెటైర్లు వేశారు. పవన్ ప్రస్తుతం కత్తులతో ఎవరిపైన యుద్ధం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడన్నారు.
ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలనుకుంటున్నాడు అంటూ విమర్శించారు.ఏపీ వ్యాప్తంగా 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు.
అసలు పవన్ వ్యాఖ్యలపై జగన్ స్పందించాల్సిన పనిలేదని, మీడియా అనవసరంగా పవన్ వ్యాఖ్యలకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు.తాను శ్వాస తీసుకోవాలో వద్దో చెప్పాలంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ చేసిన ట్వీట్ పైన రోజా స్పందించారు.
హైదరాబాద్ లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వద్దా అనేది చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని రోజా అన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పనిచేస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి పవన్, చంద్రబాబులను హైదరాబాద్ కు జగన్ పంపించడం ఖాయమంటూ మాట్లాడారు.ఈ సందర్భంగా పవన్ దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అంటూ తనదైన శైలిలో రోజా పవన్ పైన జనసేన పైన కామెంట్లు చేశారు. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy