చంద్రబాబు పై ఫైర్ బ్రాండ్ ఫైర్ !

టిడిపి అధికారంలో ఉన్నా,  ప్రతిపక్షంలో ఉన్నా, ఆ పార్టీ విషయంలో ఎప్పుడూ ఒకే వైఖరి తో ఉంటూ.ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ఏపీ మంత్రి .

 Roja Sensational Comments On Chandrababu, Cbn, Chandrababu, Jagan, Ysrcp, Tdp, R-TeluguStop.com

వైసీపీ కీలక నాయకురాలు ఆర్ కే రోజా.సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,  లోకేష్ పై ఆమె విమర్శలు చేస్తూ తన నోటికి పని చెబుతూ ఉంటారు.

తాజాగా ఏపీలో విద్యుత్ కోతలు,  పెరిగిన విద్యుత్ బిల్లుల వ్యవహారంపై చంద్రబాబు పిలుపు మేరకు టిడిపి నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న వ్యవహారంపై తాజాగా రోజా స్పందించారు.
  చంద్రబాబు హయాంలో చెల్లించాల్సిన 1800 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా బకాయి పెట్టి వెళ్లిపోయారని రోజా ఫైర్ అయ్యారు.

ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు టిడిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని , చంద్రబాబు తన హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదా అని రోజా ప్రశ్నించారు.ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తే,  జగన్ దానిని ప్రభుత్వం లో విలీనం చేశారని రోజా చెప్పారు.

తమ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం చేసిన బకాయిలను ప్రతి మూడు నెలలకు ఒకసారి కడుతున్నామని అన్నారు.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య ,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించామని రోజా అభిప్రాయపడ్డారు.

గతంలో నరకాసుర ఆంధ్ర ప్రదేశ్ గా అనిపించింది కాబట్టే చంద్రబాబును దించి,  జగన్ కు అధికారం కట్టబెట్టారు అంటూ రోజా చెప్పుకొచ్చారు.
 

Telugu Chandrababu, Jagan, Rk Roja, Roja Selvamani, Ysrcp-Telugu Political News

 మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో మూడు శాతం తగ్గాయని రోజా వివరించారు.డిస్కమ్ లకు చంద్రబాబు హయాంలో 28 వేల కోట్ల బకాయిలు పెట్టారని చంద్రబాబు కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని రోజా గుర్తు చేశారు.జగన్ కరోనా కష్టకాలంలోను సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రతి నెల 5వ తేదీన జగన్ తిరుపతి పర్యటన కు వస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు .తాను మంత్రి అయిన తర్వాత తొలిసారి సీఎం తమ జిల్లాకు రావడం పై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube