భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohith Sharma ) ఓ ప్రత్యేకత ఉంది.బౌండరీలు బాదడంలో రోహిత్ శర్మ తనకు తానే సాటి.
ఇక సిక్స్ లు కొట్టడంలో కూడా రోహిత్ ముందే ఉంటాడు.ఫార్మాట్ ఏదైనా భారీ ఇన్నింగ్స్ చేసే ప్రయత్నం చేస్తాడు.
అందుకే రోహిత్ శర్మను హిట్ మ్యాన్( Hit Man ) అని పిలుస్తారు.రోహిత్ శర్మ తక్కువ పరుగులు చేసిన అందులో ఒకటి లేదా రెండు బౌండరీలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి.
తాజాగా క్రిస్ గేల్ ( Chris Gayle ) రికార్డును బ్రేక్ చేసేందుకు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు.ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా వెస్టిండీస్ కీలక దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్ లలో 553 సిక్సులు కొట్టాడు.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 467 మ్యాచ్లలోనే 539 సిక్సులు కొట్టి క్రిస్ గేల్ రికార్డు కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.మరో 15 సిక్సులు కొడితే క్రిస్ గేల్ ఆల్ టైం రికార్డ్ బద్దలవుతుంది.దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ లు కలుపుకొని అత్యధిక సిక్సులు( Most Sixes ) కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉంటాడు.

ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న క్రిస్ గేల్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.కాబట్టి భవిష్యత్తులో రోహిత్ శర్మ సృష్టించిన రికార్డ్ ఎక్కువ కాలం తన పేరు పైనే ఉండే అవకాశం ఉంది.ఈ ఆసియా కప్ టోర్నీ సూపర్-4 మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించకుండా అన్ని మ్యాచ్లు సజావుగా జరిగితే ఆసియా కప్( Asia Cup ) టోర్నీలో క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.







