Robo Movie : రోబో సినిమా తీసి 50 లక్షల పరిహారం కట్టిన దర్శకుడు శంకర్ టీం

మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ అయిన చాలా సినిమాలు వేరే భాషల నుంచి స్ఫూర్తి పొందాయని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది.ఇక రోబో నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా హాలీవుడ్ నుంచి స్టోరీలను లిఫ్ట్ చేశాయి.

 Robo Movie Copied From Novel-TeluguStop.com

నవలల నుంచి కూడా మూవీ డైరెక్టర్స్ స్టోరీని లేపేసి సినిమాలు తీశారు.దానికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం.

మేకింగ్ Mr.Right అనే హాలీవుడ్ మూవీ 2008లో విడుదలైంది.

ఈ మూవీలో హీరోయిన్ లీజి బ్రోక్స్ అనే యువతిని రోబో హీరో ప్రేమిస్తాడు.ఈ మూవీ చాలా బాగా ఆడింది.ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

1984లోనే తెలుగు నవల రచయిత మైనంపాటి భాస్కర్ తన బుద్దిజీవి అనే నవలను ప్రచురించారు.ఈ నవలలో హీరోయిన్ శ్రీలత అనే యువతిని రోబో హీరో ప్రేమిస్తాడు.Making Mr.Right మూవీ స్టోరీ లైన్‌ బుద్దిజీవి నవలకు చాలా దగ్గరగా ఉంటుంది.ఇక 1995లో డైరెక్టర్ ఎస్.

వి కృష్ణరెడ్డి ఘటోత్కచుడు రోబో నేపథ్యంలో వచ్చింది కానీ ఇందులో లవ్ స్టోరీ అనేది ఏమీ ఉండదు.అందువల్ల ఈ సినిమా బుద్ధిజీవి నుంచి స్పూర్తి పొందినట్లు చెప్పవచ్చు.

Telugu Aishwarya Rai, Hollywood, Kollywood, Rajinikanth, Robo, Shankar-Movie

అయితే తమిళ్ ఇండస్ట్రీలో రూపొంది తెలుగులో కూడా రిలీజ్ అయిన రోబో సినిమా( Robo movie ) మైనంపాటి భాస్కర్ బుద్దిజీవి నవలను మక్కికి మక్కి కాపీ కొట్టి తీసినట్లు ఆరోపణలు వచ్చాయి.స్వయంగా స్వర్గీయ మైనంపాటి భాస్కర్ గారే టీవీ9 లైవ్ డెబెట్స్ కి వచ్చి రోబో సినిమా తన నవల నుంచి మొత్తం స్టోరీని కాపీ చేసిందని ఆరోపించారు.ఈ ఆరోపణలను శంకర్ కొట్టి పారేశారు.

తను Making Mr.Right మూవీ నుంచి మాత్రమే ప్రేరణ పొందానని, మైనంపాటి భాస్కర్ నవల గురించి తనకు తెలియదని శంకర్ చెప్పారు.

Telugu Aishwarya Rai, Hollywood, Kollywood, Rajinikanth, Robo, Shankar-Movie

2014లో మైనంపాటి భాస్కర్( Mainanpati Bhaskar ) రోబో సినిమా నిర్మాతలపై నష్టపరిహారం కోసం కోర్టులో కేసు వేశారు.ఈ కేసు ఇంకా నడుస్తోందని సమాచారం.మరోవైపు మైనంపాటి భాస్కర్ బతికి ఉన్నప్పుడు రోబో నిర్మాత 50 లక్షలు ఇచ్చి ఈ కాపీ రైట్ ఆరోపణలకు ముగింపు పలికారని వార్తలు వచ్చాయి కాగా ఇది నిజామా అబద్దమా అనేది అధికారికంగా తెలియ రాలేదు.

మొత్తం మీద మేకింగ్ మిస్టర్.రైట్ హాలీవుడ్ మూవీ, నవలా రచయిత మైనంపాటి భాస్కర్, తమిళ్ ఇండస్ట్రీ డైరెక్టర్ శంకర్ ఇంచుమించు ఒకే రోబో స్టోరీ తో ప్రజల ముందుకు వచ్చారని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube