వైరల్: నెల్లూరులో ఆశ్చర్యపోయేరీతిలో దొంగతనాలు... డాగ్ స్టోర్‌లో చోరీ చూడండి!

జనాల్లో సాధారణంగా రెండు రకాల మనుషులు వుంటారు.

కొంతమంది కస్టపడి పనిచేసి బతుకుతూ ఉంటే, మరికొందరు ఆ కస్టపడి పనిచేసి సంపాదించినవారి దగ్గర దోచుకొని బతుకుతూ వుంటారు.

వారినే మనం దొంగలు ( Thieves ) అని అంటాం.ఈ దొంగలు కూడా రకరకాలుగా సమాజంలో ముసుగులు కప్పుకొని బతుకుతూ వుంటారు.

వారిలో కొందరిని మనం నాయకులు అని అంటాం కూడా.అయితే వారి గురించి అప్రస్తుతం లెండి.

ఇపుడు మనం మాట్లకుకోబోయే దొంగలు రాత్రివేళల్లో సంచరించేవాళ్ళు.అవును, సాధారణంగా ఈ దొంగలు తమ పనికి రాత్రినే ఎంచుకుంటారు.

Advertisement

అర్ద‌రాత్రివేళ, తాళాలు వేసిన ఇళ్ళ‌ను ఎంచుకుని జాగ్రత్త ఆ ఇంట్లోకి చొర‌బ‌డి దొరికిన‌దంతా దోచేసుకుంటూ వుంటారు.అయితే కొన్ని పల్లెటూళ్లలో ప‌ట్ట‌ప‌గ‌లే ఇళ్ళ‌ల్లోకి దూరిన సంద‌ర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం.

అయితే ఇపుడు మనం చెప్పుకోబోయేది దొంగ‌త‌నం మాత్రం చాలా విచిత్ర‌మైంది.అవును, ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసింది బంగారమో, డబ్బో కాదు.

ఇళ్ళ‌ల్లో ముద్దుగా పెంచుకునే పెట్స్ ని ఎత్తుకెళ్ళ‌డం ఇపుడు సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఘ‌ట‌న మన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఇలాంటి దొంగతనం చేసిన ఘటనలు వినడం ఇదే తొలిసారి.నెల్లూరు న‌గ‌రంలో( Nellore ) ఈ దొంగ‌త‌నం జరిగినట్టు తెలుస్తోంది.

Krishna , Vijaya nirmala : కృష్ణ గారి ఆస్తి కంటే విజయ నిర్మల ఆస్తి ఎక్కువట నిజమేనా..?

వివ‌రాల్లోకి వెళితే.నెల్లూరు న‌గ‌రంలో వీఆర్సీ సెంట‌ర్ వ‌ద్ద ఓ పెట్స్( Pets Shop ) షాప్ ఉంది.

Advertisement

అందులో దేశ‌విదేశాల నుంచి ఎన్నో ర‌కాల ప‌క్షులు, పెంపుడు కుక్క‌లు, పిల్లులు తెచ్చి విక్ర‌యిస్తుంటారు.ఎన్నో ర‌కాల బ్రీడ్ పెట్స్ ఇక్క‌డ ఉన్నాయి.

ఇటీవ‌లికాలంలో ఈ పెట్స్ కి విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది.దాంతో భారీ రేటు పెట్టి నెల్లూరు వాసులు కొనుగోలు చేస్తున్నారు.దాంతో వాటిమీద కన్నేసిన కొందరు కేటుగాళ్లు అర్ధ‌రాత్రి షాపులో దూరి పెంపుడు జంతువుల‌ను ఎత్తుకెళ్ళడం మనం ఇక్కడ చూడవచ్చు.

కాగా షాపు స‌మీపంలో ఉన్న సీసీ కెమెరాలో దొంగ‌త‌నం జ‌రిగిన దృశ్యాలు రికార్డవ్వగా పోలీసులు కేసు రాసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు