సంగారెడ్డి జిల్లాలో( Sangareddy District ) ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది.ఆందోల్ మన్సాన్ పల్లిలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ట్రాక్టర్ లో( Tractor ) మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.