కష్టజీవి బ్రతుకులో తీవ్ర విషాదాన్ని నింపిన రోడ్డు ప్రమాదం.. !

రెక్కాడితే గానీ డొక్కాడని పేదల జీవితాల్లో జరగ కూడని ప్రమాదం ఏదైన జరిగితే వారిలో కలిగే వేదన, ఆ బ్రతుల్లో చోటు చేసుకునే మార్పులు ఊహించడం కష్టం.

ఎందుకంటే ఆ మార్పులను భరించే స్దోమత వారికి ఉండదు.

ఎవరైన దాతలు ఇలాంటి వారికి సహయం చేస్తే తప్ప కొన్ని సమయాల్లో బ్రతికి బట్టకట్టరు.ఇకపోతే ఊరురా తిరుగుతూ జీవనం సాగించే ఓ వ్యక్తి జీవితాన్ని తీవ్ర విషాదం రోడ్డు ప్రమాదం రూపంలో అల్లుకుంది.

ఆ వివరాలు చూస్తే.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల పరిధిలోని సంగెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఆటో పై పరుపులు వేసుకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగించే కర్నూలు జిల్లా పారాలకు చెందిన సుధాకర్(30) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడట.ఇతను ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీ కొనడంతో సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.

Advertisement

కాగా బాధితున్ని 108 వాహనంలో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లో‌ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించినట్లు సమాచారం.

ఇది కదా ట్రెండ్ అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వంటమనిషి సీవీ
Advertisement

తాజా వార్తలు