గత సంవత్సరం కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కర్ణాటక తోపాటు సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో మరియు ఉత్తర భారతం లోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ నమోదు చేసింది. దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో సందడి చేస్తుంది.డిజిటల్ ప్లాట్ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతున్న కూడా ఇంకా ఈ సినిమా ను థియేటర్ లో చూస్తున్నారట.కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
తాజాగా ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుంది.వంద రోజుల పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా విడుదల చేశారు.ఈ మధ్య కాలం లో వంద రోజుల సినిమా లను చూడనే లేదు.కానీ కాంతార సినిమా 100 రోజుల రికార్డు ను సొంతం చేసుకోవడం తో కన్నడ సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేజిఎఫ్ తర్వాత ఆ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా గా కాంతార నిలిచింది.పైగా కేజీఎఫ్ కంటే కర్ణాటక లో అత్యధిక జనాలు చూసిన సినిమా గా కూడా కాంతార రికార్డు నమోదు చేసినట్లు కన్నడ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 50 కోట్ల రూపాయలను ఈ సినిమా కలెక్ట్ చేసిందని సమాచారం అందుతుంది.అల్లు అరవింద్ సినిమా ను సమర్పించగా గీత ఆర్ట్స్ 2 వారు డబ్బింగ్ చేసి విడుదల చేయడం జరిగింది.
భారీ కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా లో రిషబ్ శెట్టి హీరో గా నటించి దర్శకత్వం వహించాడు.ఆయన తదుపరి సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







