బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు చుట్టూ తిరిగి అతని ప్రియురాలు రియా చక్రవర్తి మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది.సుశాంత్ తండ్రి రియా మీద పాట్నా పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు.
దీనిపై విచారణ కొనసాగుతుంది.సుశాంత్ ఖాతాలో 15 కోట్లు రియా అక్రమంగా దొంగిలించింది అంటూ సుశాంత్ తండ్రి ప్రధాన ఆరోపణ, అలాగే ఆమె సుశాంత్ నిమానసికంగా వేధించి అవకాశాలు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు.
ఇక పాట్నా పోలీసుల నుంచి కేసు విచారణ బాధ్యతలు ముంబై పోలీసులకి అప్పగించాలని కోరుతూ రియా సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది.
మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి సుశాంత్ ఖాతా నుంచి 15 కోట్లు ఎక్కడికి వెళ్లాయి అనే విషయంపై కూపీ లాగుతున్నారు.ఇదిలా ఉంటే తనపైన ముప్పేట దాడి చేస్తూ సుశాంత్ కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రియా ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఆ వీడియోలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.నిజం ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు.నాకు దేవుడిపైనా, న్యాయ వ్యవస్థపైనా బలమైన నమ్మకం ఉంది.న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది.
ఎలక్ట్రానిక్ మీడియాలో నాపై భయంకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారు.అయితే, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వాటిపై స్పందించవద్దని మా లాయర్లు చెప్పడంతో మౌనంగా ఉంటున్నాను.
సత్యమేవ జయతే అంటూ వీడియో ముగించారు.ఓ వైపు సోషల్ మీడియాలో సుశాంత్ మరణానికి రియా కారణం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజగా ఆమె గతంలో సుశాంత్ గురించి మాట్లాడిన ఒక వీడియో మీడియాకి చిక్కింది.అందులో సుశాంత్ ని ఎలా కంట్రోల్ చేయాలో తనకి బాగా తెలుసు.
అతను తెలివితక్కువ వాడు అంటూ మాట్లాడింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.