బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే.కొడుకు అరెస్ట్ అయిన దగ్గర్నుంచి షారుక్ ఖాన్ బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేకపోయాయి.
అయితే ఇప్పటికి షారుక్ ఖాన్ కీ కాస్త ఊరట లభించింది.అతను కోరుకున్న విధంగా అతని తనయుడికి బెయిల్ వచ్చింది.
అయితే ఇప్పటి వరకూ ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ట్రై చేసినా ఎంతో మంది లాయర్ల వల్ల కానిది ముకుల్ రోహత్గీ వల్ల అయ్యింది.ఈ రోహత్గీ దేశంలోనే ఫేమస్ లాయర్.
అలాంటిది అతడు రంగంలోకి దిగితే ఇంకా బెయిల్ రాకుండా ఉంటుందా? ఇక మొత్తానికి ఆయన గారికి బెయిలు మంజూరు చేసింది.రేపు ఆర్యన్ ఖాన్ బయటకు రాబోతున్నాడు.
ఈ విషయం పై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం రోహత్గీ కంటే ముందు వాదించిన లాయర్ లు అసమర్ధులా? అంటే ఇన్ని రోజులు తప్పు చేయకుండానే ఆర్యన్ ఖాన్ ను జైల్లో ఉంచారు? అంటూ కామెంట్ చేశారు.మన దేశంలో ఎంతోమంది ఇలా ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరు.అలాంటి వారందరూ కూడా జైలులో మగ్గిపోవాల్సిందేనా? అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించాడు? మొదటిసారిగా ఆర్జీవి చేసిన ట్వీట్ కి పాజిటివ్ గా కామెంట్లు వస్తున్నాయి.