తెలంగాణలో అయితే టిఆర్ఎస్, లేదంటే బిజెపి తప్ప మరో ఆప్షన్ లేదు అన్నట్లుగా రాజకీయ నాయకుల పరిస్థితి ఉండేది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేనట్టుగానే నాయకులు చూస్తూ వస్తున్నారు.
ఆ పార్టీలోని ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గస్థాయి నాయకులు భవిష్యత్ పై ఆందోళన తో కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ బిజెపి పార్టీలో చేరిపోయారు.ఇక ఎప్పటికీ కాంగ్రెస్ కు తెలంగాణలో ఆదరణ ఉండదని , ఆ పార్టీ లో ఉంటే పూర్తిగా రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్నట్లే అనే అభిప్రాయంతో ఎవరికి వారు టిఆర్ఎస్ బిజెపిలో చేరిపోయారు.
దీంతో కాంగ్రెస్ మరింతగా బలహీనపడిన పడింది.ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిందో అప్పటినుంచి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
కాంగ్రెస్ లో ఉంటూ బిజెపి , టిఆర్ఎస్ లలో ఏదో ఒక పార్టీలో చేరాలని ప్రయత్నాల్లో ఉన్న వారు ఇప్పుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.రేవంత్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రాగలరని నమ్మకం వారిలో కనిపిస్తోంది.
వీరే కాదు టిఆర్ఎస్ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలలోనూ ఇప్పుడు ఆలోచన మొదలైందట.దీంతో మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లాలని మెజారిటీ నాయకులు అలోచనలో ఉన్నారట.
అది కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బి ఫారం పై గెలిచిన వారు వేరే పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలని రేవంత్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం, ఈ విషయంలో తాను ముందు ఉంటానని రేవంత్ చెబుతుండడంతో కార్యకర్తలను నమ్మకం ఏర్పడింది.

అదీకాకుండా కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలోకి చేరిన వారిని మళ్లీ వనక్కి తీసుకువచ్చే కార్యక్రమం చేపడతామని, దీనికోసం ఘర్ వాపసి కార్యక్రమాన్ని చేపడతాము అంటూ రేవంత్ ప్రకటించడం వంటి వ్యాఖ్యలతో మాజీ కాంగ్రెస్ నేతల్లో ఆశలు పుట్టిస్తున్నాయి.బిజెపి, టిఆర్ఎస్ లో చేరినా అక్కడా ఇమడలేక సతమతం అవుతున్న వారంతా మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట.







