ఏపీలో రివర్స్ పాలన కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.గతంలో పెట్టుబడులకు కేరాఫ్ గా ఏపీని తయారు చేశామన్నారు.
కానీ ప్రస్తుతం రివర్స్ పాలనలో జగన్ గేర్లు మారుస్తూ స్పీడుగా వెళ్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో యువత నిరాశలో ఉన్నారని చెప్పారు.
పద్ధతి లేకుండా పాలన సాగుతోందన్న ఆయన వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని పేర్కొన్నారు.ఏపీలో వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల పరంగా విజన్ 2021 అని రూపొందించామని స్పష్టం చేశారు.