రాష్ట్రంలో హీట్ పెంచుతున్న అంశం మునుగోడు ఉప ఎన్నిక.అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హాట్ టాపిక్ గా మారుతోంది.
కాంగ్రెస్ కంచుకోటలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
ఇక బీజేపీ నుంచి రాజగోపాల్ పోటీ చేయడం ఖయమనిపిస్తోంది.ఈ క్రమంలోనే తమ సీటును తామే గెలుచుకోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశాడు.
ఏకంగా మునుగోడుపై బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నాడు.దీంతో ఇప్పుడు రాజకీయాలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డి వ్యూహం.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో ఈ ఉప ఎన్నిక గెలుపు అన్ని పార్టీలకూ తప్పనిసరి అనే చెప్పాలి.
ఈ సీటు కోసం మూడు పార్టీలు కూడా తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నాయి.టీఆర్ఎస్ అభివృద్ధి జపాన్ని నమ్ముకుంది.
ఇక బీజేపీ పూర్తిగా కోమటిరెడ్డిపైనే భారం వేసింది.ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక అస్త్రాన్ని బయటకు తీసింది.
రేవంత్ రెడ్డి ఇక్కడే పక్కా ప్లాన్ రచించారు.మునుగోడులో మెజార్టీ సంఖ్యలో బీసీలు ఉన్నారు.
అందుకే ఆ సామాజికవర్గాల కోసం బీసీలకు సీటు కేటాయించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నాడట.బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు రేవంత్ టికెట్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.ఫలితంగా రెండు నుంచి మూడు మార్గాల్లో ఓట్లను ఒడిసి పట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

బీసీ ఓట్లే అధికం…
మునుగోడు నియోజకవర్గంలో ఓటు బ్యాంకును పరిశీలిస్తే ఒక్కడ 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు.గౌడ ఓట్లు 35 వేలు పద్మశాలీలు 32 వేలు ముదిరాజ్ ఓటర్లు 31 వేల మంది ఉన్నారు.యదవుల ఓట్లు 26వేలు ఉన్నాయి.అంటే మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఓటు బ్యాంకును పరిశీలిస్తే ఇక్కడ బీసీలే 1.50 లక్షల ఓట్లు ఉన్నాయి.ఇక మాదిగలు 25వేల మంది ఉన్నారు.
మాలలు 11వేల ఓటర్లు ఉన్నారు.ఎస్టీలు 11 వేల వరకూ ఉన్నారు.
ముస్లింలు 6వేల మంది ఉన్నారు.దీంతో మునుగోడులో గెలుపోటములను శాసించేది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సామాజికవర్గాల వారే 90 శాతానికి పైగా ఉన్నారు.
ఇక అగ్రవర్ణ ఓటర్లలో 7600 కాగా.కమ్మవారు దాదాపు 5వేల మంది ఉన్నారు.
వెలమ ఓటర్లు 2500 మంది ఉన్నారు.ఆర్య వైశ్య బ్రహ్మణ సామాజికవర్గాల నుంచి మరో 4వేల మంది ఓటర్లు ఉన్నారు.
చెరుకు సుధాకర్ అయితేనే కరెక్ట్ అని.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు.
బీసీ ఓట్లన్ని తమ వైపు తిప్పుకుంటే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట.ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు కండువా కప్పిన వెంటనే టికెట్ విషయాన్ని అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలిసింది.
ఇప్పటివరకూ అక్కడ బీసీ లకు టికెట్ ఇవ్వలేదు.గతంలో పాల్వాయి, కోమటిరెడ్డి లాంటి రెడ్డీలకు టికెట్ ఇచ్చింది.
రేవంత్ బీసీ ఓట్లను టార్గెట్ చేసి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు.మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.