ఈ రోజు మన టాలీవుడ్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా మహేష్ బాబు కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల నుండి ఫ్యాన్స్ నుండి పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందుతున్నాయి.
సోషల్ మీడియా సైతం విషెష్ తో మారుమోగి పోతుంది.
మరి మహేష్ బాబు పుట్టిన రోజు ను మరింత స్పెషల్ చేయడానికి ఆయన నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
మహేష్ కెరీర్ లోనే మైల్ స్టోన్ లుగా నిలిచి పోయిన సినిమాల్లో ఒక్కడు, పోకిరి కూడా ఉంటాయి.ఈ రెండు సూపర్ హిట్ సినిమాలను స్పెషల్ షోలు వేస్తున్నారు.
వీటికి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.
ఈ రెండు షోలు హౌస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.
అయితే ఒక్కడు సినిమా స్పెషల్ షోలో మరొక హ్యాపీ మూమెంట్ కూడా చోటు చేసుకుంది.సాలిడ్ ప్రింట్స్ తో స్టార్ట్ అయినా ఈ స్పెషల్ షో లో ఫ్యాన్స్ తో పాటు ఒక్కడు చిత్ర యూనిట్ కూడా సందడి చేసింది.
ఈ బ్యూటిఫుల్ మూమెంట్ కు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ఈ సినిమా స్పెషల్ షో వేశారు.ఈ స్పెషల్ షోలో హీరోయిన్ భూమిక చావ్లా తో పాటు.డైరెక్టర్ గుణశేఖర్ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఈ స్పెషల్ షోను వీక్షించారు.
దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట షేర్ అవ్వగా అవి కాస్త వైరల్ అయ్యాయి.మహేష్ కెరీర్ లోనే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.ఎం ఎస్ రాజు నిర్మించారు.