కాంగ్రెస్ లో గ్రూపుల గోల ? చిక్కుల్లో రేవంత్ ? 

తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు గ్రూపు రాజకీయాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి .ముఖ్యంగా సీనియర్ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు ఎక్కువ ఉండేవి.

దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై అంతగా దృష్టి పెట్టకుండా, ఎక్కువగా గ్రూపు రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాల్సిన  పరిస్థితి ఉంది.ఇక తెలంగాణ కాంగ్రెస్ రథసారధిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోక ముందు నుంచి ఆయనను వ్యతిరేకించే వారి సంఖ్య కాంగ్రెస్ లో ఎక్కువయ్యింది.

ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఎంతగానో ప్రయత్నాలు చేశారు.అయినా ఆయనకు అధిష్టానం ఆశీస్సులు ఉండడంతో , ఆయనకు అధ్యక్ష పదవి దక్కింది.

గత కొద్ది రోజులుగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అదే పనిగా రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.అంతేకాదు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.

Advertisement

ఆ లేఖ వివరాలు మీడియాకు పొక్కడం పెద్ద దుమారమే రేపింది.ఇదిలా ఉంటే రేవంత్ మద్దతుదారులు కొందరు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కోవర్టు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

సోనియా గాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్ అయిందో తెలియదని, పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడ మాట్లాడలేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు .కేవలం జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య వివాదం ఒక్కటే కాదు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య చాలా కాలం నుంచి చాలా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేస్తుండడమే కాకుండా, అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతూ వస్తున్నారు.కాంగ్రెస్ లో నెలకొన్న ఈ గ్రూపులో రాజకీయాల కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ మరింత వెనకబడిపోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ ఆక్రమించింది.తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ గ్రూపు రాజకీయాలు సద్దుమణిగే వరకు ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో రాజకీయ ఊపు కనిపించడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్ 
Advertisement

తాజా వార్తలు