నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నామినేషన్ దాఖలు చేయడం తెలిసిందే.వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.హైదరాబాదు నుండి కొడంగల్ కి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్న రేవంత్ రెడ్డి పురపాలక కేంద్రం దగ్గర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ( Former MLA Gurunath Reddy )ఇంటికి వెళ్లి అక్కడ నుంచి తన స్వగృహానికి చేరుకొని కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
కొడంగల్( Kodangal ) ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలలో మీ ఆశీర్వాదం కావాలని.మీరిచ్చే బలంతో కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు నిలబెట్టానని ప్రతి ఒక్కరు తనకు అండగా నిలబడాలని కోరారు.
ఇదే సమయంలో పలు హామీలు కూడా ఇవ్వటం జరిగింది.అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.
అయితే కొడంగల్ లో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి జనం పోటెత్తారు.ఈ సందర్భంగా ట్వీట్టర్ లో రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“ఆకాశానికి చిల్లు పడలేదు…కొడంగల్ ఉప్పెనై ఎగసింది…భూమి ఈన లేదు…కాంగ్రెస్ ఉత్సాహం బ్రహ్మోత్సవమైంది.నా ఊపిరి ఉన్నంత వరకు కొడంగలే నా శ్వాస”.
అనీ ట్వీట్ చేశారు.







