రేవంత్ రెడ్డి ప్లాన్‌ బాగానే ఉంది కానీ అంత ఈజీగా వర్కౌట్ అయ్యేది కాదు

కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే.మరికొన్ని గంటల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

 Revanth Reddy Open Offer For Bjp Leaders  , Revanth Reddy , Elections,  Bjp Lead-TeluguStop.com

దేశ వ్యాప్తంగా బిజెపి( BJP ) వరుస విజయాలతో దూసుకు పోతున్న సమయంలో కాంగ్రెస్ కి సంపూర్ణ మెజారిటీ దక్కింది అంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం చేస్తున్నారు.కర్ణాటక ఫలితాలు రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో పునరావృతం కాబోతున్నాయి అంటూ ఆ పార్టీ నాయకులు చాలా ధీమాతో ఉన్నారు.

ముఖ్యంగా మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తాలూకు ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి అంటూ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చాలా ధీమాతో ఉన్నాడు.ఎలాగూ బిజెపికి కర్ణాటక( Karnataka )లో పట్టిన పరిస్థితి తెలంగాణలో కూడా పట్టబోతుంది.

కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే బిజెపిలోకి వెళ్లారు.ప్రస్తుతం బిజెపిలో ఉండి ఇమడలేక పోతున్న వారంతా కూడా కాంగ్రెస్ లోకి వచ్చేయాలంటూ రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.

Telugu Bjp, Congress, Rahul Gandhi, Revanth Reddy, Ts-Politics

బిజెపి ని నమ్ముకుంటే చివరికి ఇబ్బందులు తప్పవని, అందుకే అధికారాన్ని సొంతం చేసుకోబోతున్న కాంగ్రెస్ పార్టీకి మారాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.బిజెపిలో ఉన్న పలువురు సీనియర్ నేతల పేర్లను తీసుకొని మరి ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఇలా బాహాటంగా పార్టీ అధ్యక్షుడు ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించిన దాఖలాలు లేవు.

Telugu Bjp, Congress, Rahul Gandhi, Revanth Reddy, Ts-Politics

తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా అదిష్టానం వద్దకు వెళ్లి జాయిన్ అయి రావచ్చు అని కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి ప్లాన్ బాగానే ఉంది.మానసికంగా బిజెపి నేతలను దెబ్బ కొట్టడమే ఇది అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.ఆ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు అనేది టాక్‌.తెలంగాణ బిజెపి నాయకులు కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయి అనుకోవడం లేదు.

ఏ రాష్ట్రం పరిస్థితి ఆ రాష్ట్రానికి కచ్చితంగా వేరు వేరుగా ఉంటుంది, కనుక బిజెపి ఘన విజయం సాధిస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.కనుక రేవంత్ రెడ్డి ఆహ్వానానికి స్పందించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube