రేవంత్ కు లైన్ క్లియర్ ? ఆ యువ నేత ఎంట్రీతో క్లారిటీ ?

ఎన్నాళ్ళ నుంచో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఊరిస్తూ, ఉబ్బిస్తూ వస్తున్న పిసిసి అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానం అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ కమిటీ లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేపట్టిన సోనియా తెలంగాణపై పూర్తి స్థాయిలో పెట్టబోతున్నట్లు సమాచారం.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని నియమించి పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తోంది.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా యువ నాయకుడికి అవకాశం వచ్చింది.

అలాగే జాతీయ కమిటీ లో జరిగిన మార్పుచేర్పులను యువ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి ప్రధాన కార్యదర్శిగా వారిని నియమించింది.ఈ విషయంలో సీనియర్లను సైతం పక్కన పెట్టింది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా తమిళనాడులోని విరుధు నగర్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఠాగూర్ ను నియమించింది.యువ నాయకుడు నియామకం ద్వారా, తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి సైతం యువ నాయకుడిని నియమిస్తామనే సంకేతాలు కేంద్రం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

Advertisement

ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో చాలా పోటీ నడుస్తోంది.ఈ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

కానీ అధిష్టానం మొదటి నుంచి రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తున్నా, మిగతా సీనియర్లంతా రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.కానీ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం తగ్గించి, వారిని దీటుగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలంటే, అది రేవంత్ వల్లే సాధ్యమని అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో బలంగా ఉంది.

యువ నాయకుడు అయితేనే పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలరని కూడా అధిష్టానం నమ్ముతోంది.అదీ కాకుండా, ప్రస్తుతం కొత్త ఇంచార్జి ఠాగూర్ తో రేవంత్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, రేవంత్ పేరు అతి త్వరలోనే పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు ప్రచారం జోరందుకుంది.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు