హైకోర్ట్ లో ఎన్నికల పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉంటూ.అధికార పార్టీ టీఆర్ఎస్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే కాకుండా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్ట్ కి వెళ్లారు.

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలుపొందిన నరేందర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.రేవంత్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు.ఎన్నికల నిబంధనలను నరేంద్ర రెడ్డి ఉల్లంఘించారని ఆయన కోర్ట్కు తెలిపారు.

నరేంద్ర రెడ్డిని అనర్హుడిగా చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి
Advertisement

తాజా వార్తలు