రేపటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా రేపటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ముందుగా రేపు అలంపూర్ జోగులాంబ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

పూజల అనంతరం అలంపూర్, గద్వాల్, మక్తల్ లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.అదేవిధంగా ఎల్లుండి ఖానాపూర్, ఆదిలాబాద్ మరియు రాజేంద్రనగర్ లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

ఈనెల 9న పాలకుర్తి, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ లో సభలను ఏర్పాటు చేయనున్నారు.అదే రోజున కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది.ఈనెల10వ తేదీన జహీరాబాద్, కామారెడ్డిలో జరిగే ఎన్నికల ప్రచారానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరుకానున్నారు.అదే రోజు కామారెడ్డి సభా వేదికపై నుంచి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు