పడి లేచిన కెరటం లా విజృంభించిన రేవంత్ రెడ్డి!

తన రాజకీయ జీవితంలో అనేక ఉద్దాన పతనాలు చవిచూసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తిరిగి ఈ స్థాయిలో భౌన్స్ బ్యాక్ అవుతారని బహుశా ఎవరూ కూడా ఊహించి ఉండరేమో, అనేక అవమానాలు తట్టుకుని కూడా కాంగ్రెస్( Congress ) గెలుపు కోసం ఆయన చూపిన పట్టుదలే ఆయనను ఈ స్తాయి వరకూ తీసుకొచ్చిందని చెప్పాలి.ముఖ్యంగా ఒక దశలో తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లికి కూడా చుట్టపు చూపులా హాజరవవలసిన దుస్థితి ఆయన ఎదుర్కొన్నారు .

 Revanth Reddy Boomed Like A Falling Wave , Revanth Reddy, Congress, Senior Lead-TeluguStop.com

అప్పుడు పోలీస్ పహరా లో గంభీరం గా కూర్చున్న రేవంత్ ను చూసి పార్టీ శ్రేణుల తో పాటు సాదారణ ప్రజలు కూడా ఆ పరిస్తితి కి అయ్యో అనుకున్నారు.

Telugu Congress, Revanth Reddy, Revanthreddy, Senior, Telangana-Telugu Political

నిజానికి ఓటుకు నోటు కేసులో టీవీ కెమెరాల సాక్షిగా బయటపడిన ఉదంతం తర్వాత, ఆయన తిరిగి రాజకీయంగా పుంజుకోవటం అసాధ్యమని తెలంగాణలోని మెజారిటీ ప్రజలు భావించారు.అయితే మొక్కవోని పట్టుదలతో ఆయన ప్రయత్నించిన విధానం ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్ళించడంలో ఆయన చూపించిన చొరవ, కృషి ఈరోజు కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డికి కూడా ఉన్నత స్థానాన్ని కట్టబెట్టిందని చెప్పవచ్చు.ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవిపై అనేక ఊహగానాలు చెలరేగుతున్నా కాంగ్రెస్ ఈ స్థాయిలో తిరిగి పుంజుకోవడానికి, తిరుగులేని విధంగా మెజార్టీ సాధించడానికి ఏకైక కారణంగా నిలబడిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం వరిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Congress, Revanth Reddy, Revanthreddy, Senior, Telangana-Telugu Political

ఇప్పటికే ఆ దిశగా సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నా అధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించవలసి ఉంది.ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంచిన విధానం, కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు దూసుకొస్తున్నతీరు చూస్తుంటే తొందర్లోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ విషయం లో ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అధికారికంగా ఫలితాలు పూర్తి అవ్వకపోయినా భరాసా కాడి వదిలేసిన విధానం చూస్తే కాంగ్రెస్ గెలుపు లాంఛనమే అని బావించవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube