ఏ జబ్బులు రాకుండా జీవితాంతం సంతోషంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం చాలా అవసరం.మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఎక్కువ కాలం కూడా బతకచ్చు.
ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం.భారతదేశానికి చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ రెండు ఉత్తమ మార్గాలను అనుసరిస్తూ 80 ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్‌గా ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
అతని పేరు LC అమర్నాథన్, ఆయన వయస్సు ఇప్పుడు 80 సంవత్సరాలు.అంత వయసొచ్చినా సరే ఆయన ఇప్పటికీ జిమ్‌కి( Gym ) వెళ్లి వర్కవుట్స్ చేస్తున్నారు.
బరువులు ఎత్తడం, క్రంచెస్ చేయడం వంటి ఇంటెన్స్ ఎక్సర్‌సైజులు చేస్తున్నారు.తద్వారా యువకులలో ఫిట్నెస్ స్కూల్స్ పెంచుతున్నారు.

మరో అధికారి అరుణ్ బోత్రా అమర్‌నాథన్( Arun Bothra ) జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న చిత్రాలను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.అమర్‌నాథన్ తనకు స్ఫూర్తి అని అన్నారు.చాలా మంది ఆ చిత్రాలను చూసి అమర్‌నాథన్‌ని ప్రశంసించారు.అతను చాలా ఫిట్‌గా ఉన్నారని, వయసుకు మించి బలంగా ఉన్నారని వారు తెలిపారు.అతను మంచి తమకొక రోల్ మోడల్ అని కూడా వారు చెప్పారు.

ఆయనలా ఉండాలని కొందరు కోరుకున్నారు.వ్యాయామం( Exercise ) ప్రారంభించడానికి వయస్సు సమస్య కాదని వారు తెలిపారు.తమ శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలని, శరీరాలను బాగా ప్రేమించాలని చెప్పారు.83 ఏళ్ల వయసులో ఉన్న తన తండ్రికి ఆ చిత్రాలను చూపిస్తానని ఓ వ్యక్తి చెప్పాడు.తనతో కలిసి షికారుకి వెళ్లేందుకు తండ్రి ఒప్పుకుంటాడని ఆశపడ్డాడు.
అమర్‌నాథన్‌కి చాలా మంది చప్పట్లు కొట్టారు.అతని అంకితభావాన్ని, స్ఫూర్తిని మెచ్చుకున్నారు.
తన కథను పంచుకున్నందుకు బోత్రాకు ధన్యవాదాలు తెలిపారు.ఇది చాలా స్ఫూర్తిదాయకమని, ప్రేరణనిస్తుందని తెలిపారు.






