లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న రిటైర్డ్ డాక్టర్...హిందీ రాదని...

హిందీ రాని కారణంగా ఒక రిటైర్డ్ డాక్టర్ లోన్ ను రిజెక్ట్ చేసింది.ఈ వింత ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

ఓ రిటైర్డ్ డాక్ట‌ర్ గ‌త 15 సంవ‌త్స‌రాల నుంచి ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకులో ఖాతాదారుడిగా ఉన్నారు.అయితే ఇటీవ‌లే ఆయ‌న‌కు లోన్ అవ‌స‌రం ఉండి బ్యాంక్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు.

Retired Government Doctor Loan Application Rejected By Bank For Not Knowing Hind

అయితే బ్యాంకు మేనేజర్ అతడి లోన్ దరఖాస్తును తిరస్కరించాడు.అయితే లోన్ ను ఎందుకు తిరస్కరించారు అని తెలుసుకొనేందుకు బ్యాంకు కు వెళ్లి ఆరా తీయగా.

అప్పుడు ఆ మేనేజర్ ఇచ్చిన సమాధానం విని అతడు అవాక్కయ్యాడు.ఇంతకీ ఆ బ్యాంకు మేనేజర్ ఎందుకు లోన్ ను రిజెక్ట్ చేశాడు అంటే త‌న‌కు కేవ‌లం హిందీ మాత్ర‌మే వ‌చ్చు.

Advertisement

త‌మిళ్, ఇంగ్లీష్ రాద‌ని అందుకే లోన్ ప్రాసెస్ చేయ‌లేద‌ని బ్యాంకు మేనేజ‌ర్.స‌ద‌రు ఖాతాదారుడికి చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే త‌న‌కు లోన్ నిరాకరించిన నేప‌థ్యంలో బ్యాంకు మేనేజ‌ర్‌పై రిటైర్డ్ డాక్ట‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ. లీగ‌ల్ నోటీసులు కూడా పంపారు.కేవలం తనకు హిందీ రాని కారణంగా లోన్ ను రిజెక్ట్ చేసి త‌న‌ను మాన‌సికంగా వేధించినందుకు బ్యాంకు మేనేజర్‌పై రూ.1 ల‌క్ష ప‌రువు న‌ష్టం దావా వేశారు.అయితే మరోపక్క ఈ ఘ‌ట‌న‌ను డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండించారు.

త‌మిళుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయొద్ద‌ని బ్యాంకు మేనేజ‌ర్ ను హెచ్చ‌రించినట్లు తెలుస్తుంది.

చంద్రముఖి లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు..!
Advertisement

తాజా వార్తలు