యంగ్ ఏజ్‌లోనే ముడ‌త‌లా..? అయితే మీకోస‌మే ఈ రెమెడీ!

వ‌య‌సు పైబ‌డిన వారిలో ముడ‌త‌ల స‌మ‌స్య ఏర్ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.కానీ, ఇటీవ‌ల రోజుల్లో చాలా మందికి యంగ్ ఏజ్‌లోనే ముఖంపై ముడ‌త‌లు వ‌చ్చేస్తుంటాయి.

ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.హార్మోన్ ఛేంజ‌స్‌, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, మేక‌ప్‌తో నిద్ర పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల తొంద‌ర‌గా ముడ‌త‌లు వ‌స్తూ ఉంటాయి.

దాంతో యంగ్ ఏజ్‌లో పెద్ద వారిగా క‌నిపిస్తారు.మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ న్యాచుర‌ల్ హోమ్ రెమెడీని ప్ర‌య‌త్నిస్తే.

మీరు మీ ముడ‌త‌ల‌ను సులభంగా వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఈ రెమెడీ ఏంటో.

Advertisement

ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా పండిన ఒక అర‌టి పండును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి తొక్క‌తో పాటుగానే ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న అర‌టి పండు ముక్క‌లు, నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌టి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా ఉన్న పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల ఇన్‌స్టెంట్ కాఫీ పౌడ‌ర్ వేసి క‌లుపుకోవాలి.

చివ‌రిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి స్మూత్‌గా అప్లై చేసుకుని.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

పూర్తిగా ఆరిన త‌ర్వాతే గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే గ‌నుక ముడ‌త‌లు క్ర‌మంగా త‌గ్గిపోయి ముఖం ప్ర‌కాశవంతంగా మారుతుంది.

Advertisement

అదే స‌మ‌యంలో స్కిన్ టోన్ సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు