బ్యాక్ పెయిన్ వేధిస్తుందా..అయితే ఈ టిప్స్ మీకే?

బ్యాక్ పెయిన్‌..

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, కంప్యూటర్ ముందు ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చోవడం, గంట‌లు త‌ర‌బ‌డి నిల‌బ‌డ‌టం, ఉరుకుల పరుగుల జీవనశైలి, నిద్ర లేమి, కాల్షియం లోపం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.ఇక ఈ బ్యాక్ పెయిన్‌ను భ‌రించ‌లేక‌.

పెయిన్ కిల్ల‌ర్స్ వాడే వారు ఎంద‌రో.కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే న్మాచుర‌ల్‌గానే బ్యాక్ పెయిన్‌కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఉప్పుతో బ్యాక్ పెయిన్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Advertisement
Relieve From Back Pain, Back Pain, Home Remedies, Latest News, Health Tips, Good

ఒక బౌల్‌లో వాట‌ర్ తీసుకుని అందులో గుప్పెడు ఉప్పు వేసి బాగా వేడి చేయాలి.ఆ త‌ర్వాత ఉప్పు నీటిలో ఓ కాట‌న్ టవల్ ముంచి.

నొప్పి ఉన్న ప్రాంతంలో అద్దాలి.ఇలా చేస్తే కొన్ని నిమిషాల్లోనే బ్యాక్ పెయిన్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

వ్యాయామాలు చేసే వారిలో బ్యాక్ పెయిన్ వ‌చ్చే రిస్క్ చాలా త‌క్కువ‌.అలాగే బ్యాక్ పెయిన్‌ను త‌గ్గించ‌డంలోనూ వ్యాయామాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు క‌నీసం ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయాయాలు చేస్తే బ్యాక్ పెయిన్ దూరం అవుతుంది.

Relieve From Back Pain, Back Pain, Home Remedies, Latest News, Health Tips, Good
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అలాగే బౌల్ తీసుకుని అందులో ఐదు స్పూన్ల అవ‌నూనె మ‌రియు నాలుగు వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేడి చేయాలి.ఇప్పుడు ఈ నూనెను నొప్పి ఉన్న చోట అప్లై చేసి.కాసేపు మ‌ర్ద‌నా చేసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే.బ్యాక్ పెయిన్ నుంచి చాలా త్వ‌ర‌గా రిలీఫ్ అవుతారు.

పైన చెప్పుకున్న‌ట్టు నిద్ర లేమి కూడా బ్యాక్ పెయిన్‌కు ఒక కార‌ణం.కాబ‌ట్టి, బ్యాక్ పెయిన్‌తో బాధ ప‌డే వారు ఖ‌చ్చితంగా రోజుకు ఎనిమిది గంట‌లు నిద్ర పోవాల్సి ఉంటుంది.

అలాగే ప‌డుకునే బెడ్ స‌మానంగా ఉండేలా చూసుకోవాలి.లేదంటే బ్యాక్ పెయిన్ మ‌రింత ఎక్కువ అవుతుంది.

కూర్చొనే భంగిమ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి.కొంద‌రు వంక‌ర వంక‌ర‌గా కూర్చుంటారు.

ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ పెరుగుతుంది.ఇక‌ ప్ర‌తి రోజు కాల్షియం పుష్ప‌లంగా ఉంటే ఆహారం తీసుకోవాలి.

తాజా వార్తలు