విజయనగరం జిల్లా గృహా నిర్బంధం కేసులో వివాహితకు విముక్తి లభించింది.దాదాపు 14 సంవత్సరాల తరువాత సాయి సుప్రియ బయటి ప్రపంచంలో అడుగుపెట్టారని తెలుస్తోంది.
అత్తింటి నిర్బంధం నుంచి విడిపించినందుకు పోలీసులకు సాయిసుప్రియ ధన్యవాదాలు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో ఆనందం వ్యక్తం చేశారు.14 ఏళ్లుగా భార్య సాయి సుప్రియను పుట్టింటి వాళ్లను కూడా కలవనీయకుండా చీకటి గదికే పరిమితం చేశాడు భర్త మధుసూదన్.చుట్టు పక్కల వారికి విషయం తెలిసినా ఏం చేయలేకపోయారు.
ఈ నేపథ్యంలో తమ బిడ్డను విడిపించాలంటూ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో సెర్చ్ వారెంట్ తీసుకువెళ్లిన పోలీసులు బాధితురాలికి విముక్తి కల్పించారు.







