2023 సంక్రాంతి పండుగకు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.కొన్నిరోజుల క్రితం వరకు డిసెంబర్ లో వీరసింహారెడ్డి రిలీజ్ అవుతుందని ప్రచారం జరగగా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య పట్టుబట్టడంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనివార్యమైంది.
సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో దాదాపుగా మార్పు లేదని బోగట్టా.
మా బ్యానర్ లోనే నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పగా బాలయ్య మొన్నే ఆయన నటించిన గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ అయింది కదా అని అన్నారని సమాచారం అందుతోంది.
నా సినిమా రిలీజై సంవత్సరం అవుతోందని అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పారని తెలుస్తోంది.సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అంటే నిర్మాతలు అడిగినంత ఇవ్వలేమని బయ్యర్లు తేల్చి చెబుతున్నారని బోగట్టా.
డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య కూడా ఉండదని చెప్పినా బాలయ్య మాత్రం అదంతా మీ సమస్య అని నిర్మాతలతో అన్నారని బాలయ్య అలా చెప్పడంతో నిర్మాతలు కూడా చేసేదేం లేక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.సంక్రాంతి రిలీజ్ విషయంలో బాలయ్య పట్టుదలతో ఉన్నారని సమాచారం అందుతోంది.
సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్యదే తుది నిర్ణయమని తెలుస్తోంది.

మొదట బాలయ్య సినిమా విడుదలవుతుందో లేక చిరంజీవి సినిమా విడుదలవుతుందో మరికొన్ని రోజుల తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమాలతో పాటు సంక్రాంతి పండుగ కానుకగా ఏజెంట్, ఆదిపురుష్, వారసుడు సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో పెద్ద సినిమాలకు 400 కంటే ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గతంలో ఏ సినిమాకు రాని సమస్య ఈ సినిమాకు వచ్చిందని మైత్రీ నిర్మాతలు తల పట్టుకుంటున్నారని బోగట్టా.
