సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఎందుకంటే ఇక్కడ చేయడానికి పని దొరకదు, ఉండడానికి డబ్బులు ఉండవు అయిన కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ తో,సాధించాలనే సంకల్పంతో, ఇక్కడ ఉండి పోరాటం చేసే వాళ్లే చాలామంది ఉన్నారు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) లాంటి డైరెక్టర్ కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని తన కథలతో ప్రేక్షకులందరిని మెప్పించాడు.ఇక ఆ తర్వాత ఆయన రాసుకున్న స్టోరీలను తనే డైరెక్షన్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే తను మొదట్లో స్ట్రగులింగ్ లో ఉన్నప్పుడు సునీల్ తో కలిసి ఒక చిన్న రూములో ఉండేవాడని సమయం వచ్చిన ప్రతిసారి చెబుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్పీ పట్నాయక్( RP Patnaik ) కూడా త్రివిక్రమ్ కి చాలా మంచి ఫ్రెండ్ ఈయన కూడా మొదట్లో త్రివిక్రమ్ వాళ్ల గల్లీలోనే ఉండేవారని అవకాశం వచ్చిన ప్రతిసారి వీళ్ళు కలుసుకుంటూ సినిమాల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండేవారట…అలా ఆర్పి పట్నాయక్ కూడా తనకొచ్చిన అవకాశాలను వాడుకుంటునే ఆయన త్రివిక్రమ్ గురించి కూడా ఆఫీస్ లలో చెప్పేవారట.
ఇక మొత్తానికైతే వీళ్లంతా ఒక టీం వర్క్( Team Work ) లాగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశారు.ఇక ముఖ్యంగా ఆర్పీ పట్నాయక్ వళ్ల కూడా త్రివిక్రమ్ కి కొన్ని సినిమాలు చేసే అవకాశాలను కూడా వచ్చాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం… ఇక మొత్తానికైతే వీళ్లంతా ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా సినిమాల ద్వారా పేరుని, డబ్బులను సంపాదించుకొని చాలా బాగా సెట్ అయ్యారు…ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు…
.