ప్రముఖ స్మార్ట్ ఫోన్లు తయారీ సంస్థ షియోమీ( Xiaomi ) నుంచి రెడ్ మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచింగ్ కానుంది.అయితే ఆన్ లైన్ లో ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన డిజైన్ తో పాటు స్పెసిఫికేషన్ వివరాలు లీక్ అయ్యాయి.
ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
రెడ్ మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్:
( Redmi Turbo 3 ) ఈ ఫోన్ 6.78 అంగుళాల OLED డిస్ ప్లే తో వస్తోంది.144Hz రిఫ్రెష్ రేట్ కలిగి 6000mAh బ్యాటరీ ( 6000mAh battery ) సామర్థ్యం తో 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఈ ఫోన్ వెనుక ప్యానెల్ రింగ్ లాంటి ఫ్లాష్ యూనిట్ తో పాటు రెండు కెమెరా సెన్సార్ లతో ఉంటుంది.ఇక పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ హ్యాండ్ సెట్ యొక్క కుడి వైపు అంచున ఉంచబడ్డాయి.
ఈ రెడ్ మీ టర్బో3 స్లిమ్ బెజెల్స్ తో పాటు డిస్ ప్లే, ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ హోల్-పంచ్ స్లాట్ ను కలిగి ఉంటుందని అధికారిక weibo పోస్ట్ వెల్లడించింది.ఈ రెడ్ మీ టర్బో 3 ఫోన్ 7.8 మి.మీ మందం,179 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.టాప్ వేరియంట్ 16GB RAM మరియు 1TB ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో రానుంది.ఈ ఫోన్ షియోమీ Hyper OS ను అవుట్-ఆఫ్-ది-బాక్స్ గా కూడా తీసుకువస్తుంది.
షియోమీ యొక్క చైనా వెబ్ సైట్ లోని ల్యాండింగ్ పేజీ సమాచారం ప్రకారం.ఏప్రిల్ 10వ తేదీ చైనా మార్కెట్లో రెడ్ మీ టర్బో 3 లాంచ్ అవ్వనుంది.
ఈ ఫోన్ గోల్డెన్, గ్రీన్, బ్లాక్ కలర్లలో లభిస్తుంది.ఈ ఫోన్ కు సంబంధించిన ధర వివరాలు లాంచింగ్ సమయంలో తెలియనున్నాయి.